ఆడియో రైట్స్ అమ్మకంలో పుష్ప-2 రికార్డు

  • ఏకంగా రూ.65 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం
  • ఇండియన్ సినీ చరిత్రలో ఇదే అత్యధికం
  • థియేటర్, ఓటీటీ హక్కుల అమ్మకంపై పెరిగిన అంచనాలు
సంచలన విజయం సాధించిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప-2‘ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా చిత్రీకరణ దశలోనే ఉన్న ఈ సినిమా రికార్డుల వేట మొదలు పెట్టింది. ఆడియో రైట్స్ అమ్మకంలో దేశ సినీ చరిత్రలోనే రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఆడియో రైట్స్ సుమారు రూ.65 కోట్లకు అమ్ముడుపోయినట్లు, అన్ని భాషల ఆడియో రైట్స్‌ను టీ సిరీస్‌ సంస్థ దాదాపుగా తీసుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డు కలెక్షన్లు రాబట్టిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆడియో రైట్స్ అమ్మకం ద్వారా నిర్మాతలు ఆర్జించింది రూ.30 కోట్లే.

ఈ నేపథ్యంలో పుష్ప-2 సినిమా థియేటర్, ఓటీటీ హక్కుల అమ్మకం ద్వారా ఇంకెంత రాబడుతుందో, ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందోననే అంచనాలు పెరిగిపోయాయి. అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ, సునీల్‌, ఫవాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేసి సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


More Telugu News