మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానున్న '2018' మూవీ కోసమే అంతా వెయిటింగ్!

  • మే 5న మలయాళంలో విడుదలైన '2018'
  • 26న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 
  • ప్రపంచవ్యాప్తంగా 160 కోట్లకి పైగా వసూళ్లు
  • రేపటి నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్
మలయాళంలో ఈ మధ్య కాలంలో ఎక్కువమంది మాట్లాడుకున్న సినిమా ఏదైనా ఉందంటే అది '2018' సినిమానే. ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. కేరళలో 2018లో వరదలు సంభవించినప్పుడు, అక్కడి ప్రజలు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారనేదే ఈ సినిమా. మే 5వ తేదీన మలయాళంలో విడుదలైన ఈ సినిమా, వసూళ్ల పరంగా అక్కడ కొత్త రికార్డులను నమోదు చేసింది. 

ఇక మే 26వ తేదీన ఈ సినిమాను తెలుగులోను రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమాకి రోజుకి ఒక కోటికి పైగానే వసూలు చేస్తూ వెళ్లింది. అలాంటి ఈ సినిమాను సోని లివ్ లో ఈ నెల 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. అప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 160 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. ఐదు భాషల్లోను ఈ సినిమా సోనీలివ్ లో అందుబాటులోకి రానుందనే విషయం తెలిసిన దగ్గర నుంచి వసూళ్ల వేగం తగ్గింది. 

ఇక థియేటర్స్ లో చూడలేకపోయిన వాళ్లంతా ఈ సినిమాను గురించి ఇప్పటికే పాజిటివ్ గా విని ఉన్నారు. అందువలన ఈ సినిమా కోసం వాళ్లంతా వెయిట్ చేస్తున్నారు. ఆపద సమయంలో అందరిలోను మానవత్వం మేల్కొంటుంది అనే సందేశాన్ని ఇస్తూ సాగే ఈ కథకి ప్రేక్షకులు తప్పక కనెక్ట్ అవుతారు. ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


More Telugu News