మళ్లీ పట్టాలెక్కిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
- అందుబాటులోకి వచ్చిన ట్రాక్
- మూడు రోజుల తర్వాత ప్రయాణం ప్రారంభించిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
- మెసేజీల ద్వారా రిజర్వేషన్ ప్రయాణికులకు సమాచారం
ఒడిశాలోని బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై తీవ్ర విషాదాన్ని నింపిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది. ప్రమాదం తర్వాత రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత నిరంతరాయంగా శ్రమించిన సిబ్బంది ట్రాక్‌ను పునరుద్ధరించి రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం చేశారు.
దీంతో మూడు రోజుల తర్వాత చెన్నై-షాలిమర్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మళ్లీ పట్టాలెక్కింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైలు బయలుదేరుతున్నట్టు మెసేజ్‌ల ద్వారా సమాచారం అందించారు. నిన్న ఉదయం 10.45 గంటలకు చెన్నైలోని ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరింది.