మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఇవి..: గోల్డ్ మ్యాన్ శాక్స్ సిఫార్సులు

  • ఈ తరహా అవకాశాలున్న స్టాక్స్ గుర్తింపు
  • లార్జ్, మిడ్ క్యాప్ విభాగంలో స్టాక్స్ తో జాబితా విడుదల
  • మల్టీ బ్యాగర్ అంటే నూరు శాతం రాబడులు ఖాయం
పెట్టుబడులు పెట్టిన తర్వాత, ఆ మొత్తం గణనీయంగా పెరిగిపోవాలని ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కోరుకుంటాడు. స్టాక్ మార్కెట్లో మల్టీబ్యాగర్ల గురించి తరచూ వింటుంటాం. గడిచిన ఏడాది కాలంలో 100 శాతం, 200 శాతం, గడిచిన ఐదేళ్లలో 500 శాతం మేర పెరిగిన స్టాక్స్ గురించి వార్తలు వినిపిస్తుంటాయి. దీంతో అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనే ఆసక్తి ఇన్వెస్టర్లలో ఉంటుంది. మల్టీ బ్యాగర్ అంటే.. ఇక్కడి నుంచి పలు రెట్లు పెరిగేవని అర్థం. ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గోల్డ్ మ్యాన్ శాక్స్.. మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలున్న 60 స్టాక్స్ తో జాబితాను విడుదల చేసింది. 

లార్జ్ క్యాప్ విభాగంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బీఐ, భారతీ ఎయిర్ టెల్, మారుతి సుజుకీ ఉన్నాయి. మిడ్ క్యాప్ విభాగంలో త్రివేణి టర్బయిన్, వెస్ట్ లైఫ్ ఫుడ్, మెట్రో బ్రాండ్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, భారత్ డైనమిక్స్, సోలార్ ఇండస్ట్రీస్, టింకెన్ ఇండియా, యూనో మిండా, మదర్సన్ సుమీ వైరింగ్, వేదాంత్ ఫ్యాషన్స్, రాజేష్ ఎక్స్ పోర్ట్స్, దేవయాని ఇంటర్నేషనల్, వీఐపీ ఇండస్ట్రీస్, కన్సాయ్ నెరోలాక్, వినతి ఆర్గానిక్స్, బాటా ఇండియా, సుమిటోమో కెమికల్ ఉన్నాయి.


More Telugu News