కర్నూలులో రైతుకు దొరికిన రూ.2 కోట్ల విలువైన వజ్రం

  • కొనుగోలు చేసేందుకు పోటీ పడిన వజ్రాల వ్యాపారులు
  • రూ.2 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న గుత్తి వ్యాపారి
  • తొలకరి జల్లు కురవడంతో జిల్లాలో ఊపందుకున్న వజ్రాల వేట
తొలకరి పడిందంటే అన్నదాతలు వ్యవసాయ పనులు మొదలుపెడతారు. సాగుకు ఏర్పాట్లు చేస్తుంటారు. మిగతా చోట ఎలా ఉన్నా కర్నూలు జిల్లాలో మాత్రం తొలకరి తర్వాత చిన్నాపెద్దా తేడా లేకుండా జనం పొలాల బాట పడతారు. అయితే, వ్యవసాయ పనుల కోసం మాత్రం కాదు.. వజ్రాల వేట కోసం. అవును, వజ్రాల వేటే. రాయలసీమలోని పలు జిల్లాల్లో ఏటా ఈ సీజన్ లో ఇది సాధారణమే. ముఖ్యంగా వజ్రకరూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఏటా కొంతమంది రైతుల దశ తిరిగి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతుంటారు.

ఇటీవల వర్షం కురవడంతో కర్నూలు జిల్లా మద్దెకర మండలంలో వజ్రాల కోసం పొలాల్లో రైతులు అన్వేషణ మొదలుపెట్టారు. మండలంలోని బసినేపల్లిలో ఓ రైతుకు విలువైన రాయి దొరికింది. ఆ రాయిని అక్కడే అమ్మకానికి పెట్టగా.. కొనేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. చివరకు గుత్తికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి ఆ రాయిని రూ.2 కోట్లకు సొంతం చేసుకున్నాడని సమాచారం. ఈ వార్త తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లోని జనం కూడా పొలాల్లో వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు.


More Telugu News