'నేను స్టూడెంట్ సర్' కి అదే మైనస్ అయిందనే టాక్!

  • ఈ నెల 2న వచ్చిన 'నేను స్టూడెంట్ సర్'
  • తొలి రోజునే వచ్చిన నెగెటివ్ టాక్
  • వీకెండ్ లోను పుంజుకోని తీరు 
  • పొసగని అంశాలే దెబ్బకొట్టాయనే టాక్ 
బెల్లంకొండ గణేశ్ ఇంతకుముందే వచ్చిన 'స్వాతి ముత్యం' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. చిన్న సినిమానే అయినా అందులో మంచి పాయింట్ ఉంది. అమాయకత్వానికి మనం పెట్టుకున్న పేరే మంచితనం అన్నట్టుగా ఆ సినిమాలోని పాత్రకి ఆయన కరెక్టుగా సెట్ అయ్యాడు. ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా . ఆ తరువాత సినిమాగా ఆయన చేసినదే 'నేను స్టూడెంట్ సర్'. 

ఈ నెల 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అవంతిక దాసాని కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా రిలీజ్ రోజున వచ్చిన టాక్ .. వీకెండ్ తరువాత కూడా మారలేదు. తన 'ఐ ఫోన్' ను పోలీసులే కాజేశారనీ .. అది పోలీస్ కమిషనర్ దగ్గరే ఉందని హీరో భావించడం, ఆయన రివాల్వర్ ను సంపాదించి తన ఫోన్ తనకి ఇస్తేనే ఆ రివాల్వర్ ఇస్తానని బెదిరించడం.. కొన్ని రోజుల పరిచయానికే అడగ్గానే హీరోకి పోలీస్ కమిషనర్ కూతురే ఆ రివాల్వర్ ఇచ్చేయడం ఇక్కడ అతకని విషయం .. అర్థం లేని అంశం. 

పోనీ ఆ ఫోన్ లో ఏదైనా సీక్రెట్ ఉందా అంటే అదీ లేదు .. నిజంగానే ఆ ఫోన్ కమిషనర్ తీశాడా అంటే తీయలేదు. దీని వెనుక వేరేవారి కుట్ర కోణం ఏదైనా ఉందా అంటే లేదు. వేరే రూట్లో జరుగుతున్న మాఫియాకి .. ఈ ఫోన్ కి ఎలాంటి సంబంధం లేదు. హీరోకి .. కమిషనర్ కి మధ్య బలమైన విలన్ ఉన్నాడా అంటే లేడు. ఆ విలనిజం అనేది ఒక గుంపుగా కనిపిస్తుంది. ఆ గుంపులో 'జబర్దస్త్' రామ్ ప్రసాద్ ఒకరు. ఇలా ఎక్కడా పొసగని అంశాల కారణంగానే ఈ సినిమా ఆకట్టుకోలేకపోయిందనీ .. అవే మైనస్ గా మారాయనే టాక్ వినిపిస్తోంది.



More Telugu News