ఆస్ట్రేలియాతో రేపే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్.. కోహ్లీని ఊరిస్తున్న పలు రికార్డులు ఇవే!
- రేపు ఇండియా, ఆసీస్ మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్
- లండన్ లోని ఓవల్ వేదికగా కీలక మ్యాచ్
- సచిన్, ధోనీ, పుజారా, పాంటింగ్ రికార్డులు బద్దలయ్యే అవకాశం
ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ రేపు ప్రారంభం కానుంది. లండన్ లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఛాంపియన్ షిప్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. మరోవైపు దిగ్గజ బ్యాట్స్ మెన్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. వీటిలో విరాట్ ఎన్ని రికార్డులను కైవసం చేసుకుంటాడో వేచి చూడాలి.
కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే:
ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఇప్పటి వరకు ఎక్కువ సంఖ్యలో ఐసీసీ నాకౌట్ స్టేజ్ మ్యాచ్ లు ఆడాడు. ఐసీసీ నాకౌట్ స్టేజ్ లో వన్డే ప్రపంచకప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలతో కలిపి పాంటింగ్ 18 మ్యాచ్ లు ఆడాడు. యువరాజ్ సింగ్ 17 మ్యాచ్ లు ఆడారు. సచిన్, ధోనీ, కోహ్లీలు 15 మ్యాచ్ లు ఆడారు. రేపటి మ్యాచ్ తో ధోనీ, సచిన్ ల రికార్డును కోహ్లీ అధిగమించనున్నారు.
ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆస్ట్రేలియాపై కోహ్లీ 92 మ్యాచ్ లలో 50.97 యావరేజ్ తో 4,945 పరుగులు చేశాడు. మరో 45 పరుగులు చేస్తే ఆస్ట్రేలియాపై కోహ్లీ 5 వేల పరుగుల మార్క్ ను అధిగమిస్తాడు.
ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాట్స్ మెన్ గా రాహుల్ ద్రావిడ్ పేరిట రికార్డు ఉంది. 2,645 పరుగులతో ద్రావిడ్ తొలి స్థానంలో ఉండగా... 2,626 పరుగులతో సచిన్ రెండో స్థానంలో ఉన్నాడు. 2,574 పరుగులతో కోహ్లీ మోడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో ద్రావిడ్, సచిన్ ల రికార్డును కోహ్లీ అధిగమించే అవకాశాలు ఉన్నాయి.
ఒక బౌలర్ పై ఒక బ్యాట్స్ మెన్ చేసిన అత్యధిక పరుగుల రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా టెస్ట్ స్టార్ ఛటేశ్వర్ పుజారా పేరిట ఉంది. నాథన్ లియోన్ (ఆస్ట్రేలియా) బౌలింగ్ లో పుజారా 570 పరుగులు చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) బౌలింగ్ లో స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా) 520 పరుగులు చేశాడు. సయీద్ అజ్మల్ (పాకిస్థాన్) పై కుమార సంగక్కర (శ్రీలంక) 531 పరుగులు సాధించాడు. కోహ్లీ విషయానికి వస్తే నాథన్ లియోన్ బౌలింగ్ లో 511 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ మరో రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది.
ఐసీసీ నాకౌట్ స్టేజ్ లో కోహ్లీ ఇప్పటి వరకు 620 పరుగుల చేశాడు. రిక్కీ పాంటింగ్ 731 పరుగులు, సచిన్ 657 పరుగులు చేశారు. ఈ రికార్డులను బద్దలు కొడితే కోహ్లీ 'కింగ్ ఆఫ్ ఐసీసీ నాకౌట్ మ్యాచెస్'గా అవతరిస్తాడు.
ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 2 వేల పరుగులు సాధించే రికార్డు. ఇప్పటి వరకు ఆసీస్ పై కోహ్లీ 24 టెస్టుల్లో 1,979 పరుగులు చేశాడు.