మోదీ స్థానంలో నా మిత్రుడు ప్రధాని కావాలి: కేఏ పాల్
- మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలన్న కేఏ పాల్
- అమిత్ షా ప్రధాని కావాలని ఆకాంక్ష
- అమిత్ షా నాయకత్వంలో దేశం మరింత ముందుకెళుతుందని వెల్లడి
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని నిన్ననే చెప్పానని అన్నారు. మోదీ స్థానంలో నా మిత్రుడు అమిత్ షాను ప్రధానమంత్రిని చేస్తే దేశం ఇంకా అద్భుతంగా ముందుకెళుతుందని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ దారుణంగా విఫలమయ్యారని కేఏ పాల్ విమర్శించారు.
ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ ఒక పెద్ద డ్రామా అని అభివర్ణించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు కనీసం 50 సార్లు అపాయింట్ మెంట్ అడిగి ఉంటారని, కానీ తన మిత్రుడు అమిత్ షా ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని పాల్ తెలిపారు. మరి ఇప్పుడెందుకు అపాయింట్ మెంట్ ఇచ్చినట్టు? అని ప్రశ్నించారు. చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని, అలాంటి ముప్పు తప్పించుకోవాలంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోవాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.