'అహింస' మూవీ మండే టాక్!

  • ఈ నెల 2వ తేదీన విడుదలైన 'అహింస'
  • తొలిఆటతోనే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా
  • తేజ గత చిత్రాల మాదిరిగా లేదనే అభిప్రాయాలు 
  • కథాకథనాలు దెబ్బతీశాయంటూ టాక్  
తేజ నుంచి చాలా గ్యాప్ తరువాత వచ్చిన మరో ప్రేమకథా చిత్రమే 'అహింస'. ఆనంది ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 2వ తేదీన థియేటర్లకు వచ్చింది. రానా సోదరుడు అభిరామ్ ఈ సినిమాతో తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యాడు. కథానాయికగా కనిపించిన గీతిక తివారికి కూడా ఇది మొదటి సినిమానే. తేజ నుంచి ఒక లవ్ స్టోరీ వస్తుందంటే తప్పకుండా అందులో బలమైన కంటెంట్ ఉంటుందని ఆడియన్స్ భావిస్తారు. అయితే ఈ సినిమా మాత్రం ఆ నమ్మకానికి చాలాదూరంగానే ఆగిపోయింది.

ఈ సినిమాలో ఇటో హీరో .. అటు హీరోయిన్ .. ఈ మధ్యలో ఓ ముగ్గురు విలన్స్ కనిపిస్తారు. హీరోయిన్ కి అన్యాయం చేసిన యువకుల తండ్రిగా ఒక విలన్ .. కోర్టులో ఆమెకి న్యాయం జరగకుండా అడ్డుకునే వకీల్ విలన్ .. అడవిలో అడ్డుతగిలే రౌడీ విలన్. ఈ ముగ్గురూ హీరోహీరోయిన్లను ఎటూ మెసలనీయరు. కథ మొదలైన కాసేపటికే హీరోయిన్ రేప్ కి గురై, హాస్పిటల్ బెడ్ పైనే ఎక్కువ సేపు ఉండిపోతుంది. హీరో హాస్పిటల్ నుంచి .. కోర్టు నుంచి ఇంటికి పరిగెత్తుకు వెళ్లడం .. పరిగెత్తుకు రావడం .. ఇక్కడే సగం సమయం గడిచిపోతుంది. 

ఎప్పుడైతే హీరోయిన్ కి అన్యాయం జరుగుతుందో అప్పటి నుంచి ఇద్దరి మధ్య పాటలు పాడుకునే అవకాశం లేకుండా పోయింది. హీరోయిన్ చనిపోయిందని ఆడిటోరియం అనుకునే సమయంలో ఆమె నోట్లో నోరు పెట్టి హీరో గాలి ఊదేసి బ్రతికిస్తాడు. హమ్మయ్య అని ఆడియన్స్ అనుకునేలోగా ఆమె లేచి లిప్ కిస్ ఈయమని హీరోను అడుగుతుంది. ఇలాంటి సిల్లీ సీన్స్ కారణంగా కథతో .. ఎమోషన్స్ తో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. అందువల్లనే ఈ సినిమాను మొదటి నుంచి చివరివరకూ ఓపికగా చూడటం తమ వలన కావడం లేదనేది పబ్లిక్ టాక్ గా వినిపిస్తోంది.



More Telugu News