ఒడిశా రైలు ప్రమాదం: విచారణలో లోకోపైలట్ వ్యాఖ్యలు కీలకం!

  • తొలుత మెయిన్ లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఆ తర్వాత లూప్ లైన్ లోకి ఇచ్చినట్లు వెల్లడి
  • అక్కడే గూడ్స్ ఉండటంతో ప్రమాదం జరిగినట్లు తెలిపిన లోకోపైలట్
  • ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్ మొహంతి
ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో లోకో పైలట్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారనున్నాయి. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో గూడ్స్ రైలును ఢీకొట్టినట్లుగా రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక తెలిపింది. కానీ కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే అది లూప్ లైన్ లోకి వెళ్లిందని, సిగ్నల్ జంప్ చేయలేదని లోకో పైలట్ గుణనిధి మొహంతి తెలిపారు. సిగ్నల్ విషయంలో ఏం జరిగిందో అతను చెప్పాడు.

తొలుత మెయిన్ లైన్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, ఆ తర్వాత వెంటనే మార్చబడిందని, అప్పుడే లూప్ లైన్ లోకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పాడు. కానీ అక్కడ గూడ్స్ రైలు ఆగి ఉండటంతో ప్రమాదం జరిగినట్లు వెల్లడించాడు. లోకో పైలట్ మొహంతి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు.

మరోవైపు, ప్రమాదం సమయంలో రైలు అతివేగంగా వెళ్లడం లేదని రైల్వే బోర్డు ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్ మెంట్ సభ్యురాలు జయవర్శ సిన్హా తెలిపారు. గ్రీన్ సిగ్నల్ వచ్చాకే డ్రైవర్ ముందుకు సాగినట్లు వెల్లడించారు. అతను సిగ్నల్ జంప్ చేయలేదని, అలాగే అతివేగంతో వెళ్లలేదని తెలిపారు. నిర్దేశించిన గరిష్ఠ వేగంతో రైలును డ్రైవ్ చేసినట్లు చెప్పారు.


More Telugu News