టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో వెలుగులోకి షాకింగ్ అంశాలు
- సిట్ విచారణలో కీలక అంశాలు వెల్లడించిన డీఈ రమేశ్
- రమేశ్ ద్వారా ఓ మాజీ ఎంపీటీసీ కూతురు పరీక్ష రాసినట్లుగా వెల్లడి
- పరీక్షకు నెల రోజుల ముందే కలిసి ఎలక్ట్రానికి డివైజ్ అందజేత
- ఉద్యోగం వచ్చాక డబ్బులు ఇస్తామని రమేశ్ కు చెప్పిన సదరు నేత
- రమేశ్ 80 మందికి ఏఈఈ పేపర్లు అమ్మినట్లుగా గుర్తింపు
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. కోర్టు అనుమతితో ఇటీవల విద్యుత్ శాఖ డీఈ రమేశ్ ను కస్టడీకి తీసుకున్న సిట్, అతనిని విచారించింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధితో రమేశ్ ఒప్పందం చేసుకున్నట్లుగా ఈ విచారణలో వెల్లడైనట్లుగా తెలుస్తోంది. బొమ్మకల్ మాజీ ఎంపీటీసీ కూతురు... రమేశ్ ద్వారా ఏఈఈ పరీక్షను రాసినట్లు తేలింది. ఏఈఈ ఉద్యోగం ఇప్పిస్తానని రమేశ్ రూ.75 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఏఈఈ పరీక్ష జనవరి 22న జరిగింది. ఈ పరీక్షకు నెల రోజుల ముందే సదరు మాజీ ఎంపీటీసీని రమేశ్ కలిశాడు. పరీక్షకు ముందు ఆమెకు ఎలక్ట్రానిక్ డివైస్ ఇచ్చాడు. తన కూతురుకు ఉద్యోగం వచ్చాకనే డబ్బులు చెల్లిస్తానని రమేశ్ తో చెప్పాడు. ఎలక్ట్రానిక్ డివైజ్ జాకెట్ కోసం కూడా ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని తెలుస్తోంది. డీఈ రమేశ్ 80 మందికి ఏఈఈ పేపర్లు అమ్మినట్లుగా గుర్తించారు. ఒక్కొక్కరి నుండి కనీసం రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడని తెలుస్తోంది.