51 గంటల్లోనే బాలాసోర్ ట్రాక్ పునరుద్ధరణ.. పట్టాలపైకి తొలి రైలు
- ప్రమాదంలో ధ్వంసమైన రెండు ట్రాక్‌లను సరిచేసిన అధికారులు
- దగ్గరుండి పనులు పర్యవేక్షించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
- 275 మందిని పొట్టనపెట్టుకున్న ఘోర ప్రమాదం
ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్‌లో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ట్రాక్ ను సరి చేసి రైల్వే సేవలు తిరిగి పునరుద్ధరించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఘటనాస్థలంలోనే వుండి పునరుద్ధరణ పనులు పర్యవేక్షించారు. వెయ్యిమంది కూలీలు, భారీగా యంత్రాలు ఉపయోగించి, యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేశారు. పూర్తిగా ధ్వంసమైన రెండు ట్రాక్‌లను కేవలం 51 గంటల్లోనే తిరిగి పునరుద్ధరించారు.
పునరుద్ధరించిన ట్రాక్‌పై గూడ్స్ రైలు వెళ్తుండగా తీసిన వీడియోను వైష్ణవ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ట్రాక్ పై గ్రూడ్స్ రైలు వెళ్తున్న సమయంలో ఆయన రెండు జోతులు జోడించి నమస్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం సాయంత్రం తొలి రైలు ట్రాక్‌లపై నడిచిందని ట్వీట్ చేశారు. కాగా, దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఈ రైల్వే ప్రమాదంలో 275 మంది మృతి చెందారు. 1100 మంది వరకు గాయపడ్డారు.