రైలు ప్రమాదం మృతుల సంఖ్య 288 కాదు.. 275
- అధికారికంగా ప్రకటించిన ఒడిశా ప్రధాన కార్యదర్శి
- కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించారని వెల్లడి
- మొత్తం 1175 మంది గాయపడ్డారని వెల్లడి
ఒడిశా రైలు ప్రమాదంలో మృతులు, గాయపడ్డవారిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 288 కాదని 275 మంది మృతి చెందినట్లు ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ ప్రకటించారు. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించడం వల్ల మరణాలసంఖ్య 288గా వచ్చిందని చెప్పారు. ఇప్పటివరకు 108 మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించినట్టు తెలిపారు. మిగిలిన 167 మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు.
ప్రత్యేక వైద్య బృందం డీఎన్‌ఏ పరీక్షలు చేసి మృతదేహాలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించిందన్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో మొత్తం 1175 మంది గాయపడ్డారని ప్రదీప్ జెనా వెల్లడించారు. 336 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 382 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని సీఎస్ పేర్కొన్నారు.