వారికి త‌ల‌వంచా.. అందుకే: డీకే శివ‌కుమార్‌

  • డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవడంపై స్పందించిన డీకే
  • ప్రజలు తన కోసం భారీగా ఓట్లేసినా హైక‌మాండ్ మ‌రో నిర్ణ‌యం తీసుకుందని వ్యాఖ్య
  • తానిప్పుడు మ‌రింత స‌హ‌నంతో వేచిచూడాల్సి ఉంద‌ని వెల్లడి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నించారు. కొన్ని రోజులపాటు జరిగిన చర్చోపచర్చల తర్వాత సిద్ధరామయ్యను సీఎంగా హైకమాండ్ ఎంపిక చేసింది. చివరికి డీకే శివకుమార్ వెనక్కి తగ్గి.. డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్నారు. ఇందుకు కారణమేంటనేది తాజాగా డీకే బయటపెట్టారు. 

రామ‌న‌గ‌ర‌లో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి డీకే శివ‌కుమార్ మాట్లాడుతూ.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సూచ‌న మేర‌కు సీఎం కావాల‌నే త‌న ఆకాంక్ష‌ను విడిచిపెట్టాన‌ని చెప్పుకొచ్చారు. ‘‘న‌న్ను ముఖ్య‌మంత్రిని చేసేందుకు మీరంతా పెద్దసంఖ్య‌లో నాకు ఓట్లు వేశారు. కానీ హైక‌మాండ్ మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. అగ్ర నేత‌లు సోనియా, రాహుల్‌, ఖ‌ర్గేలు ఇచ్చిన సూచ‌న‌కు నేను త‌ల‌వంచా’’ అని చెప్పారు. తానిప్పుడు మ‌రింత స‌హ‌నంతో వేచిచూడాల్సి ఉంద‌ని అన్నారు. ఇదే సమయంలో ప్రజల ఆకాంక్ష‌లు మాత్రం వృథా కావ‌ని స్ప‌ష్టం చేశారు.


More Telugu News