రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేని జగన్ బాబాయ్‌కు ఇప్పించారు.. రఘురామకృష్ణరాజు వ్యాఖ్య

  • ఢిల్లీలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ పత్రికా సమావేశం
  • ఏపీ సీఎం జగన్‌పై మరోసారి విమర్శలు
  • బాబాయ్‌కు సీఎం ప్రత్యేక హోదా ఇప్పించుకున్నారని నెటిజన్లు అంటున్నట్టు వెల్లడి
  • జనసేన అధినేత పవన్‌ ఈసారి 60 వేల మెజారిటీతో గెలుస్తారని ధీమా
ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయిన ముఖ్యమంత్రి జగన్ తన బాబాయ్‌ వై.ఎస్ భాస్కర్ రెడ్డికి  జైల్లో ప్రత్యేక హోదా (సౌకర్యాలు) వచ్చేలా ఢిల్లీ పెద్దలను ఒప్పించగలిగారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. శనివారం ఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రజాకోర్టులో న్యాయమూర్తులైన ప్రజలకు తమ తీర్పు చెప్పే అవకాశం వస్తుందని అన్నారు. 

నిబంధనలు అతిక్రమిస్తూ జగన్, కేంద్ర సర్వీసుల్లోని జూనియర్ అధికారులను రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై తీసుకొచ్చి కీలక బాధ్యతలు కట్టబెడుతున్నారని, ఈ విషయంలో రాష్ట్రంలోని సీనియర్ అధికారులు ప్రశ్నించరా అని అన్నారు. టీటీడీ ఈవో పోస్ట్ ఐఏఎస్ అధికారుల హక్కు అని, కానీ ఈ పోస్టులో ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ధర్మారెడ్డిని నియమించారని గుర్తు చేశారు. భీమవరం నుంచి పోటీచేయాలని తాను పవన్‌ను కోరుతున్నట్టు చెప్పారు. మంచి మనిషిని ఓడించామని ప్రజలు బాధపడుతున్నారని, ఈసారి ఆయనకు 60 వేలకు పైగా మెజారిటీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News