అధికార పార్టీ కార్పొరేటర్‌పై కర్నూలు నగర మేయర్ గుస్సా

  • శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఘటన
  • తన నియోజకవర్గానికి నిధులు మంజూరు కావట్లేదన్న కార్పొరేటర్ క్రాంతికుమార్
  • మేయర్ డివిజన్‌లో రూ.7 కోట్ల పనులు జరిగాయని వ్యాఖ్య
  • ఇష్టానుసారం మాట్లాడితే సస్పెండ్ చేయాల్సి వస్తుందని మేయర్ హెచ్చరిక
  • ఇతర కార్పొరేటర్ల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య అధికార పార్టీ కార్పొరేటర్‌పై ఫైరయ్యారు. కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశం సందర్భంగా కార్పొరేటర్ క్రాంతికుమార్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తొలుత కార్పొరేటర్ తన డివిజన్‌లో అభివృద్ధి జరగట్లేదని ఫిర్యాదు చేశారు. ‘‘మేయర్ డివిజన్‌లో మాత్రం రూ.7 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తే మాకు అరకొరగా నిధులిచ్చారు. నేనూ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధినే’’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

దీనిపై మేయర్ స్పందిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరని ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరిక చేశారు. తనను బయటకు తీసుకెళ్లేందుకు పోలీసులు రాగా తానేం తప్పు చేశానో చెప్పాలని కార్పొరేటర్ డిమాండ్ చేశారు. అయితే, సహచర కార్పొరేటర్లు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.


More Telugu News