ఒడిశా రైలు ప్రమాదం.. హైదరాబాద్ వాసులపై స్పష్టత

  • ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర దుర్ఘటన
  • హైదరాబాద్‌కు చెందిన అవినాశ్‌కు గాయాలైనట్టు వార్తలు
  • నిర్ధారించని అధికారులు
  • ప్రమాదానికి గురైన రైళ్లకు తెలంగాణ రూట్లతో సంబంధం లేదని స్పష్టీకరణ
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు ఎవరూ లేరన్న వార్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. హైదరాబాద్ కానీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ కోరమాండల్, హౌర్ మెయిల్‌లో ప్రయాణించలేదని గత రాత్రి సికింద్రాబాద్ స్టేషన్ అధికారులకు సమాచారం అందింది. 

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన హైదరాబాద్‌కు చెందిన అవినాశ్‌కు ప్రమాదంలో కాలు విరిగితే కటక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తను అధికారులు ధ్రువీకరించలేదు. ప్రమాదానికి గురైన రెండు రైళ్లకు తెలంగాణ రూట్లతో సంబంధం లేదని, కాబట్టి అక్కడివారు ఎక్కే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు.


More Telugu News