కోరమాండల్ కు మొదట మెయిన్ లైన్ సిగ్నల్ ఇచ్చి ఆ తర్వాత తీసేశారు: రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక

  • ఒడిశాలో మహా విషాదం
  • బాలాసోర్ జిల్లాలో ఢీకొన్న మూడు రైళ్లు
  • 288 మంది మృతి
  • ప్రాథమిక నివేదిక రూపొందించిన రైల్వే 
  • కోరమాండల్ లూప్ లైన్ లోకి వచ్చినట్టు వెల్లడి
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక రూపొందించింది. సిగ్నల్ తప్పిదం కారణంగానే రైలు ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ ఆ నివేదికలో వెల్లడించింది. 

లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టిందని వివరించింది. మొదట మెయిన్ లైన్ పై వెళ్లేందుకే కోరమాండల్ కు సిగ్నల్ ఇచ్చారని, కానీ ఆ తర్వాత తీసేశారని పేర్కొంది. అలా ఎందుకు జరిగిందన్నది మాత్రం నివేదికలో వివరించలేదు.

మెయిన్ లైన్ లో వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్ లోకి వెళ్లిందని రైల్వే శాఖ పేర్కొంది. 

లూప్ లైన్ లో ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ ఢీకొట్టగా, బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయని రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కు చెందిన 21 బోగీలు పట్టాలు తప్పాయని... గార్డు బోగీతో పాటు హెచ్1 ఏసీ బోగీ మెయిన్ లైన్ పై పడ్డాయని వెల్లడించింది. ఇంజిన్ మాత్రం గూడ్సు రైలు పైకెక్కిందని వివంరించిది. 

అదే సమయంలో బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ రైలు వచ్చిందని, దాంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని వివరించింది.


More Telugu News