కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో రాజమండ్రిలో దిగాల్సిన ప్రయాణికుల్లో 21 మంది సురక్షితం

  • ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ లో అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య
  • రాజమండ్రిలో దిగేందుకు కోరమాండల్ లో 24 మంది ఎక్కారన్న అధికారులు
  • ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు వెల్లడి
ఒడిశాలోని బాలాసోర్ వద్ద చోటు చేసుకున్న ఘోర ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంటులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 288 మంది మృతి చెందినట్టు గుర్తించారు. 900 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు. తర్వాతి స్థానంలో తమిళులు ఎక్కువగా ఉన్నారు. మరోవైపు రైళ్లలో ఏపీకి చెందిన ప్రయాణికులు కూడా ఉన్నారు. రాజమండ్రికి వచ్చేందుకు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 24 మంది ఎక్కారని రైల్వే అధికారులు చెపుతున్నారు. వీరిలో 21 మంది సురక్షితంగా ఉన్నారని, మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.


More Telugu News