ఓలా ఎస్1 ప్రో సముద్రంలో నడిపితే ఎలా ఉంటుంది? ఓ యూట్యూబర్ సాహసం

  • సముద్ర తీరంలో నీటిలో ముంచి డ్రైవింగ్
  • నిక్షేపంలా పనిచేసిన ఎలక్ట్రిక్ స్కూటర్
  • వర్షానికి తడిసినా ఏమీ కాదనే సందేశం
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా ఎస్1 ప్రోకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. డిజైన్, ఫీచర్ల పరంగా అత్యాధునికంగా ఉండే ఈ టూవీలర్ కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసే వారికి ఒక భయం ఉంటుంది. వర్షాకాలంలో, జోరు వానలో వెళ్లాల్సి వస్తే, అందులో చిక్కుకుంటే ఏమిటి పరిస్థితి? అనే సందేహం వస్తుంటుంది. ముఖ్యంగా పట్టణాల్లో చిన్న వర్షానికే  వీధుల్లో రెండు, మూడు అడుగుల మేర నీరు వస్తుంటుంది. అలాంటప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు పనిచేస్తాయా? ఈ సందేహం తీరాలంటే ప్రముఖ యూట్యూబర్ ‘అకి డీ హాట్ పిస్టోంజ్’ చేసిన వీడియోని చూస్తే సరిపోతుంది. 

యూట్యూబర్ ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ను సముద్ర తీరంలోకి తీసుకెళ్లాడు. నీటిలో సీటు మునిగే దాకా వెళ్లి డ్రైవ్ చేశాడు. అతడు, బైక్ రెండూ సురక్షితంగానే ఉన్నాయి. నిజానికి సముద్రం నీరు అంటే ఉప్పుతో కూడుకుని ఉంటుంది. ఇది వాహనాన్ని డ్యామేజ్ చేయవచ్చు. కానీ, అతడికి ఇది మినహా మరో మార్గం కనిపించక అలా చేశాడు. నీటిలో మునిగినప్పటికీ ఎలా ఎస్1 ప్రో స్కూటర్ మోటారు పనిచేస్తూనే ఉంది. స్క్రీన్ కూడా ఆగిపోలేదు. సీటు కింద భాగంలోనే నీరు నిలిచింది. చార్జింగ్ సాకెట్ పూర్తిగా పొడిబారేలా జాగ్రత్త తీసుకున్నారు. 


More Telugu News