ప్రీ పెయిడ్ సైకిల్.. నడుస్తుండగా బ్యాలన్స్ అయిపోతే ఏంటి పరిస్థితి?
- లాక్ పడిపోవడం, కింద పడిపోవడం ఖాయం
- ఇందుకు సంబంధించి నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియో
- కిందపడి ముక్కు పగలగొట్టుకున్న యువకుడు
బైక్ లేదా సైకిల్ ముందస్తుగా చెల్లించి వాడుకునే రైడింగ్ సేవలు చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. స్థానికులతో పాటు పర్యాటకులకు సైతం ఇవి అనుకూలంగా ఉంటాయి. వీటికి కిలోమీటర్ కు ఇంత చొప్పున చార్జీ చేస్తుంటారు. కాకపోతే ముందుగానే అకౌంట్ ను రీచార్జ్ చేసుకోవాలి. సరిపడా రీచార్జ్ లేకపోతే అది ప్రమాదానికి కారణం కావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోయేది అలాంటి ఘటన గురించే.
ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్న ఓ వీడియోని గమనిస్తే.. ప్రీపెయిడ్ బైక్, సైకిల్ సేవలు ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. బ్యాలన్స్ అయిపోతే నడుస్తున్న వాహనానికి ఒకేసారి లాక్స్ పడిపోతాయి. దీంతో దానిపై ప్రయాణిస్తున్న వారు కింద పడిపోవడం ఖాయం. నడిపే వారికి రక్షణ లేకుండా ఇదేం వ్యవస్థో అర్థం కావడం లేదు. బ్యాలన్స్ జీరో అయిపోతే వేగం తగ్గుతూ కొన్నిసెకన్ల వ్యవధిలో ఆగిపోవాలి. అంతేకానీ ఉన్నట్టుండి ఆగిపోతే కింద పడిపోవడం లేదంటే, వెనుకనున్న వాహనం ఢీకొట్టడం జరుగుతాయి.
ఇందుకు సంబంధించి ఓ వీడియోని గబ్బర్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ‘‘పెట్టుబడిదారీ మనస్తత్వానికి ఇది పరాకాష్ఠ. ప్రీపెయిడ్ బ్యాలన్స్ అయిపోయిన వెంటనే రెంటల్ బైక్ ఆటోమేటిగ్గా లాక్ అయిపోతోంది’’ అని ట్వీట్ చేశారు.