ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు

  • గిరిజన గ్రామాల్లో పాఠశాలలు లేకపోవడంపై స్పందించిన ఎన్ హెచ్ఆర్సీ
  • అల్లూరి జిల్లా జాజులబండలో పాఠశాల లేని వైనం
  • ప్రభుత్వాన్ని వివరణ కోరిన మానవ హక్కుల సంఘం 
ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. గిరిజన గ్రామాల్లో పాఠశాలలు లేకపోవడంపై ఎన్ హెచ్ఆర్సీ స్పందించింది. అల్లూరి జిల్లా జాజులబండలో పాఠశాల లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. 

గ్రామంలో 60 మంది విద్యార్థులున్నా పాఠశాల లేదని, విద్యార్థులు 6 కిలోమీటర్ల మేర కొండలు దాటుకుంటూ పాఠశాలకు వెళ్లలేకపోతున్నారని ప్రచారం జరిగింది. విద్యార్థుల వెతలపై ఓ స్వచ్ఛంద సేవా సంస్థ స్పందించి తాత్కాలిక పాఠశాల ఏర్పాటు చేసింది. 

ఈ వ్యవహారాన్ని ఎన్ హెచ్ఆర్సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఎన్జీవో ఏర్పాటు చేసిన పాఠశాలలో టీచర్ ను ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పాఠశాల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది.


More Telugu News