బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాధితురాలి ఆత్మహత్యాయత్నం!
- సూసైడ్ లెటర్ రాసి, విషం తాగిన ఆరిజిన్ పాల డెయిరీ సంస్థ భాగస్వామి
- దుర్గం తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపణ
- ఢిల్లీలో తాను నిరసన చేస్తుంటే, ఫోటోలు మార్ఫింగ్ చేశాడని లేఖలో పేర్కొన్న బాధితురాలు
బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆరిజిన్ పాల సంస్థ భాగస్వామి శేజల్ శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను వెంటనే ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు ఆమె సూసైడ్ లేఖ రాశారు. అందులో దుర్గం వేధిస్తున్నట్లు ఆరోపించారు. ఆయన అనుచరులు కూడా కొంతమంది హింసిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
తనను చంపేస్తానని దుర్గం చిన్నయ్య బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఢిల్లీలో తాను నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ తన ఫోటోలను మార్ఫింగ్ చేశారన్నారు. తాను చనిపోయాక అయినా న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని, అందుకే లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె న్యాయమూర్తులు, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పోలీస్, మీడియాకు లేఖ రాశారు. కాగా, ఎమ్మెల్యే దుర్గంకు, అరిజిన్ డెయిరీ పాల కంపెనీ ప్రతినిధులకు మధ్య గతంలో వివాదం చెలరేగింది.