రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పలేని దుస్థితిలో సీఎం ఉన్నారు: చంద్రబాబు

  • రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు
  • ప్రతి ఏటా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరిపామని వెల్లడి
  • విభజన సమయంలో  సమన్యాయం కోసం పోరాడామని వివరణ 
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి నేటికి 9 ఏళ్లు పూర్తయ్యాయని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నానని పేర్కొన్నారు.     తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేస్తే, ఎన్టీఆర్ తెలుగుజాతి అభ్యున్నతి కోసం టీడీపీని స్దాపించారని వివరించారు. 

తెలుగు జాతి అభివృద్ది కోసం విజన్ 2020 రూపొందించి అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలో ఎవరూ సాధించలేని విజయాలు సాధించామని చంద్రబాబు పేర్కొన్నారు. 1995 లో తాను సీఎంగా ఉన్నపుడు ఉమ్మడి రాష్ట్రంలో సెకండరీ జెనరేషన్ రిఫార్మ్స్  అమలు చేశామని వెల్లడించారు. టెక్నాలజీని అందింపుచ్చుకుని ముందుకెళ్లామని, దాని పలితమే నేడు తెలంగాణ ఐటీలో నెం.1 స్ధానంలో ఉందని తెలిపారు.

చంద్రబాబు ప్రెస్ మీట్ హైలైట్స్...

• సంపద సృష్టించి ఆ సంపదను సంక్షేమం రూపంలో ప్రజలకు పంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
• విభజన సమయంలో రెండు రాష్ట్రాల ప్రజలు ఆనందంగా ఉండాలని సమన్యాయం చేయాలని టీడీపీ పోరాడింది.
• ప్రతి ఏటా జూన్ 2న రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం జరిపాం, కానీ నేడు కనీసం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పలేని దుస్ధితిలో సీఎం ఉన్నారు.
• శివరామకృష్ణన్ కమిటీ సూచన మేరకు అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో రాజధాని అమరావతికి రూపకల్పన చేశాం.
• ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు రాజధానికి స్వచ్చందంగా ఇచ్చారు. 
• నాడు టీడీపీ ప్రభుత్వ కృషితో అమరావతికి 139 సంస్థలు వచ్చాయి, 50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఆ ఒప్పందాలు కొనసాగి ఉంటే 30 లక్షల మందికి ఉపాధి లభించేది.
• రాజధానిలోని మిగులు భూమి విలువ పెరిగి ప్రభుత్వానికి సుమారు రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చేది.
• అమరావతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా వైసీపీ అంగీకరించింది, విజయవాడ గుంటూరు మద్యలో రాజధాని ఉండాలని 30 వేల ఎకరాలుండాలని చెప్పారు.
• కానీ మాట మార్చి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటలాడుతున్నారు.
• 9 ఏళ్లయినా రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియని పరిస్ధితి. 
• భూములిచ్చిన రైతులు 1200 రోజుల నుంచి తిండి తిప్పలు మాని రోడ్లపై ఉద్యమం చేయాల్సి రావటం బాధాకరం.  
• ప్రపంచమంతా తిరిగి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చాం, ఈజ్ ఆప్ డూయింగ్ లో వరుసగా నెం.1 స్ధానంలో  నిలిచాం.
• రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి 5.13 లక్షల ఉద్యోగాలు కల్పించాం. 
• నేడు ఎఫ్ డీఐలో 10వ స్ధానంలో ఉన్నాం, ఏపీ ఐటీ ఎగుమతులు కేవలం 0.2 శాతం మాత్రమే. 
• నాడు సంక్షేమానికి పెద్దపీట వేశాం, ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాం 
• తెలగాంణలో రైతులకు లక్ష రుణమాఫీ చేస్తే, ఏపీలో రూ.1.50 లక్షల రుణమాఫీ చేశాం. 
• 2014-19 కాలంలో రాష్ట్రంలో 10.8 శాతం గ్రోత్ రేటు సాధించాం, ఇది దేశంలో ఒక రికార్డ్ , దాన్ని ఇప్పటివరకూ ఎవరూ  బ్రేక్ చేయలేరు. 
• వ్యవసాయ రంగంలో 11 శాతం వృద్ది సాధించాం, నేడు రాష్ట్రం దిగజారిపోవడానికి ఎవరు కారణం?
• కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న వ్యక్తి  కేసుల మాఫీకి తాకట్టు పెట్టారు.
• కేసులు లాలూచీ చేసేందుకు రాజ్యసభ సీట్లు అమ్ముకుని విభజన హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారు.  
• ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజన్, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ మెట్రో రైల్ , వైజాగ్ చైన్నై కారిడార్ వీటి గురించి కనీసం మాట్లాడటం లేదు. 
• 9 ఏళ్లైనా విభజన చట్టంలోని హామీలు పరిష్కారం కాలేదు.
• వైసీపీ పాలనలో అప్పులు, అవినీతి, విద్వసం తప్ప అభివృద్ది లేదు, రాష్ట్రాన్ని రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. 
• జీతాలు అడిగితే ఉద్యోగులపై అక్రమ కేసులు పెడుతున్నారు
• తెలుగుజాతి అభివృద్ది కోసం నిరంతరం పని చేస్తాం, గాడి తప్పిన రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను టీడీపీ తీసుకుంటుంది. 
• పూర్ టు రిచ్ కార్యక్రమంతో 2047 నాటికి ఏపీలో పేదలు లేకుండా అందర్నీ కోటీశ్వరుల్ని చేస్తాం. 
• వచ్చే ఎన్నికల్లో జరిగేది క్యాష్ వార్,  పేదలకు దోపిడీదారులకు జరుగుతున్న యుద్ధం.
• వైసీపీ నేతలు దోచుకున్నదంతా ప్రజలకు అప్పజెప్పే బాధ్యత టీడీపీదే.
• మా మానిఫెస్టో అంశాలు కాపీ అని జగన్ చెప్పడం ఒక అర్థం లేని విమర్శ.


More Telugu News