పోస్టాఫీసులో 7.5 శాతం వడ్డీ ఇచ్చే పథకం ఇదిగో!
- బ్యాంకుల తరహాలో పోస్టాఫీసుల్లో టైమ్ డిపాజిట్ స్కీమ్
- నాలుగు కాల వ్యవధులతో డిపాజిట్ చేసే వెసులుబాటు
- ఐదేళ్ల కాలవ్యవధితో డిపాజిట్ చేస్తే గరిష్ఠ ప్రయోజనం
బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ పథకం లాంటిదే పోస్టాఫీసుల్లోనూ ఓ పథకం ఉంది. దాని పేరు టైమ్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో నాలుగు వేర్వేరు కాల వ్యవధుల్లో డబ్బును డిపాజిట్ చేసే వీలుంటుంది.
గరిష్ఠంగా ఐదేళ్ల పాటు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయవచ్చు. ఐదేళ్ల కాల వ్యవధికి డిపాజిట్ చేస్తే 7.5 శాతం వడ్డీ పొందుతారు. ఒక సంవత్సర కాలానికి డిపాజిట్ చేస్తే 6.8 శాతం, రెండేళ్ల కాలవ్యవధికి డిపాజిట్ చేస్తే 6.9 శాతం, మూడేళ్ల కాలానికి డిపాజిట్ చేస్తే 7 శాతం వడ్డీ ఇస్తారు.
కనీస డిపాజిట్ మొత్తం రూ.1000 కాగా, గరిష్ఠంగా ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. డిపాజిట్ చేసే మొత్తానికి పరిమితి లేదు. ఈ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే... ఐదేళ్ల కాలవ్యవధి పూర్తయిన తర్వాత... అసలు రూ.5 లక్షలతో పాటు వడ్డీ రూపంలో మరో రూ.2,24,974 పొందుతారు.