కన్నా లక్ష్మీనారాయణ సక్సెస్ రేటు ఎక్కువ.. నాది తక్కువ: అంబటి రాంబాబు
- టీడీపీ, జనసేనలు తనను టార్గెట్ చేశాయన్న అంబటి
- రాజకీయాల్లో కన్నా లక్ష్మీనారాయణ పెద్ద వస్తాదు అని వ్యాఖ్య
- కన్నా మాదిరి తాను పార్టీలు మారలేదని ఎద్దేవా
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ బాధ్యతలను కన్నా లక్ష్మీనారాయణకు చంద్రబాబు అప్పగించడంతో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. కాపు సామాజికవర్గానికి చెందిన అంబటిపై అదే సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు బరిలోకి దించారు. మరోవైపు తాజాగా అంబటి రాంబాబు మాట్లాడుతూ... చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై తాను విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో టీడీపీ, జనసేనలు తనను టార్గెట్ చేశాయని చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాల్లో పెద్ద వస్తాదు అని అన్నారు. రాజకీయాల్లో కన్నా లక్ష్మీనారాయణ సక్సెస్ రేటు చాలా ఎక్కువని, తన సక్సెస్ రేటు తక్కువని చెప్పారు. అయితే, కన్నా లక్ష్మీనారాయణ మాదిరి తాను పార్టీలు మారలేదని అన్నారు.
కన్నా, తాను ఇద్దరం ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని... అయితే ఆయన తనకంటే ఎక్కువ సక్సెస్ అయ్యారని చెప్పారు. తాను పార్టీలు మారలేదని, కాంగ్రెస్ నే నమ్ముకున్నానని, ఆ తర్వాత జగన్ కోసం వైసీపీలోకి వచ్చానని అన్నారు. సత్తెనపల్లి టీడీపీ బాధ్యతలు కన్నాకు ఇవ్వడం అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పారు.