చంద్రబాబు నివాసం లింగమనేని గెస్ట్ హౌస్ జఫ్తు పిటిషన్‌పై 6న తీర్పు

  • ఇరుపక్షాల వాదనల అనంతరం నిర్ణయాన్ని వాయిదా వేసిన కోర్టు
  • కరకట్ట మీది లింగమనేని నివాసాన్ని అటాచ్ చేయాలని ప్రభుత్వం జీవో
  • ఇంటిని జఫ్తు చేసేందుకు ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అద్దెకు ఉంటున్న లింగమనేని రమేశ్ గెస్ట్ హౌస్ జఫ్తుపై ఏసీబీ కోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇవ్వనుంది. లింగమనేని గెస్ట్ హౌస్ జఫ్తుపై సీఐడీ వేసిన పిటిషన్ పై విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 6వ తేదీన నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని నివాసాన్ని అటాచ్ చేయాలని ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేయగా, ఇంటిని జఫ్తు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విని తీర్పును 6వ తేదీకి వాయిదా వేసింది.


More Telugu News