ఉక్రెయిన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా వాటికన్ చర్చిలో దుస్తులు విప్పేసి నిరసన

  • ఉక్రెయిన్‌తో 15 నెలలుగా యుద్ధం చేస్తున్న రష్యా
  • నిరసనగా చర్చిలోని ప్రధాన బలిపీఠం వద్ద నగ్నంగా నిరసన
  • పట్టుకుని పోలీసులకు అప్పగించిన వాటికన్ గార్డులు
ఏడాదికిపైగా ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికా చర్చిలో ఓ వ్యక్తి దుస్తులు విప్పి నిరసన తెలపడం కలకలం రేపింది. ఉక్రెయిన్‌లోని చిన్నారులను రక్షించాలి అని అతడి వీపుపై పెయింట్‌తో రాసి ఉంది. నిన్న చర్చి మూసివేయడానికి ముందు ఈ ఘటన జరిగింది. 

ప్రధాన బలిపీఠం వద్ద నగ్నంగా నిరసన తెలిపిన అతడిని టూరిస్టులు తమ కెమెరాల్లో బంధించారు. ఇప్పుడా వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. నిరసన తెలిపిన వ్యక్తి తన గోళ్లతో శరీరంపై గాయాలు చేసుకున్నట్టు రాయటర్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అతడిని పట్టుకున్న వాటికన్ గార్డులు పోలీసులకు అప్పగించారు. దుస్తులు విప్పి నిరసన తెలిపిన వ్యక్తి ఎవరనేది గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.


More Telugu News