తెలంగాణ కీర్తి, ఖ్యాతి అజరామరంగా భాసిల్లాలి: పవన్ కల్యాణ్
- నేడు తెలంగాణ 10వ అవతరణ దినోత్సవం
- తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని ఆకాంక్షించిన పవన్
- అమరవీరులకు నివాళి అర్పిస్తున్నామని ట్వీట్
నేడు తెలంగాణ 10వ అవతరణ దినోత్సవం. ఉద్యమాలు, ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 4 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షలకు, వేలాది మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, అభివృద్ది పథంలో దూసుకెళ్లాలని జనసేన పార్టీ తరపున ఆకాంక్షిస్తూ, తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పిస్తున్నామని తెలిపారు. పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ కీర్తి, ఖ్యాతి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నానని చెప్పారు.