శంషాబాద్-విజయవాడ-విశాఖపట్నం మధ్య సూపర్ ఫాస్ట్ రైలు!
- కర్నూలు-విజయవాడ మధ్య మరో రైల్వే లైన్
- రెండు లైన్లపై కసరత్తు మొదలెట్టిన రైల్వే శాఖ
- రూట్ల ఎంపిక కోసం త్వరలో పెట్ సర్వే
- సర్వే అనంతరం ప్రాజెక్టు మంజూరుపై రైల్వే శాఖ తుది నిర్ణయం
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ గుడ్ న్యూస్! శంషాబాద్-విజయవాడ-విశాఖపట్నం, కర్నూలు-విజయవాడ మధ్య సూపర్ ఫాస్ట్ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా కసరత్తు మొదలెట్టిన రైల్వే శాఖ, ప్రిలిమినరీ ఇంజినీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వేకు తాజాగా అనుమతించింది. సర్వే అనంతరం రైల్వే శాఖ ఈ ప్రాజెక్టుల మంజూరుపై తుది నిర్ణయం తీసుకుంటుంది. శంషాబాద్-విజయవాడ రైలు అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఇటీవల ఈ ప్రాజెక్టుల ప్రాధాన్యత గురించి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వివరించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రధాన రూట్లలో రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 110-150 కిలోమీటర్లు ఉండగా శంషాబాద్-విజయవాడ, కర్నూలు-విజయవాడ మధ్య గంటకు 220 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో రైళ్లను నడపాలని రైల్వే శాఖ యోచనగా ఉంది. ఇందుకోసం నూతన లైన్లను నిర్మించాలని తలపోస్తోంది. ఈ క్రమంలో రూట్‌ను నిర్ణయించేందుకు పెట్ సర్వే కోసం ఓ కాంట్రాక్టర్‌ను కూడా ఎంపిక చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వందేభారత్ రైళ్లను నడిపేందుకు కూడా రైల్వే శాఖ రెడీ అవుతోంది.