మద్యం పాలసీ మంచిదే అయితే ఎందుకు రద్దు చేశారు?: మనీశ్ సిసోడియాకు హైకోర్టు ప్రశ్న
- తమ ప్రశ్నకు సరైన సమాధానంతో రావాలని సిసోడియా తరఫు లాయర్ కు ఆదేశం
- గతంలోను ఇదే ప్రశ్న సంధించిన హైకోర్టు
- ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతించనందునే పాలసీ వెనక్కి తీసుకున్నట్లు వెల్లడి
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైకోర్టు కీలక ప్రశ్నలు వేసింది. కొత్త మద్యం పాలసీ మంచిదే అయితే దానిని ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానంతో తమ ముందుకు రావాలని ఆదేశించింది. ఈ కేసులో సిసోడియాతో పాటు మనీలాండరింగ్ కు పాల్పడ్డారనే అభియోగం ఎదుర్కొంటున్న సహ నిందితుడు విజయ్ నాయర్ ల మధ్యంతర బెయిల్ పిటిషన్ పై గురువారం విచారణ జరిగింది.
ఈ సమయంలో ఢిల్లీ హైకోర్టు... మీరు తీసుకు వచ్చిన మద్యం పాలసీ మంచిదే అయితే మళ్లీ దానిని ఎందుకు వెనక్కి తీసుకున్నారు..? దీనికి సూటిగా సమాధానం చెప్పాలంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.
గతంలోను కోర్టు ఇదే ప్రశ్న సంధించింది. అయితే నాన్ కన్ఫర్మింగ్ జోన్లలో మద్యం విక్రయాల కోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతించలేదని, దీంతో మద్యం పాలసీ విధానాన్ని వెనక్కి తీసుకున్నామని మనీశ్ సిసోడియా తరఫు లాయర్లు చెప్పారు.
కాగా, సీబీఐ, ఈడీ కేసుల్లో గతంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఉపసంహరించుకోవడానికి కోర్టు మనీశ్ సిసోడియాకు మే 24న అనుమతి ఇచ్చింది. దీనిని వెనక్కి తీసుకోకపోవడంతో మే 30న విచారణ చేపట్టింది. మద్యం పాలసీ స్కాంలో మనీశ్ ప్రభావవంతమైన వ్యక్తి అని, ఆయనపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవి అంటూ బెయిల్ పిటిషన్లను కొట్టి వేసింది. దీంతో సిసోడియా, విజయ్ మధ్యంతర బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు.