ఈ నెల 10న భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ప్రారంభించనున్న చంద్రబాబు
- భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ప్రకటించిన చంద్రబాబు
- రేపు నియోజక వర్గాల పరిశీలకులతో భేటీ
- కార్యక్రమ విధివిధానాలపై చర్చ
- కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దిశానిర్దేశం
రాజమండ్రి మహానాడు సభలో టీడీపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం మొత్తం 150 రోజుల పాటు సాగనుంది. ఈ నెల 10వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
రేపు నియోజకవర్గాల పరిశీలకులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమ విధివిధానాలపై వారితో చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించడమే భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమ ముఖ్యోద్దేశంగా తెలుస్తోంది.