టీమిండియా కోసం అడిడాస్ జెర్సీలు... లాంచింగ్ అదిరిపోయింది.!

  • భారత క్రికెట్ జట్టు నూతన కిట్ స్పాన్సర్ గా అడిడాస్
  • మూడు ఫార్మాట్ల కోసం వేర్వేరు జెర్సీల రూపకల్పన
  • ముంబయి వాంఖెడే స్టేడియంపై డ్రోన్ల సాయంతో భారీ జెర్సీల ఆవిష్కరణ 
టీమిండియా నూతన కిట్ స్పాన్సర్, ప్రముఖ క్రీడా ఉపకరణాల సంస్థ అడిడాస్ తాజాగా ఆటగాళ్ల కోసం జెర్సీలు రూపొందించింది. టీమిండియా ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో ఈ జెర్సీలు ఉపయోగించనున్నారు. అడిడాస్  ఐదేళ్ల పాటు టీమిండియా కిట్ స్పాన్సర్ గా వ్యవహరించేందుకు ఇటీవలే బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. 

తాజాగా, టెస్టులు, వన్డేలు, టీ20 మ్యాచ్ ల్లో టీమిండియా ఆటగాళ్లు ధరించేందుకు గాను మూడు వేర్వేరు జెర్సీలను నేడు ఆవిష్కరించింది. ఈ ఆవిష్కరణ మునుపెన్నడూ లేనంతగా వినూత్న రీతిలో సాగింది. ముంబయి వాంఖెడే స్టేడియంపైన మూడు భారీ జెర్సీలు ఆకాశం నుంచి వేళ్లాడుతున్నట్టుగా ఏర్పాటు చేశారు. అందుకోసం డ్రోన్లను వినియోగించారు. దీనికి సంబంధించిన వీడియోను అడిడాస్ ఇండియా సోషల్ మీడియాలో విడుదల చేసింది. 

కాగా, ప్రస్తుతం విడుదల చేసిన జెర్సీలు... టీమిండియా నూతన కిట్ కు గ్లింప్స్ మాత్రమే. త్వరలోనే పూర్తిస్థాయి కిట్ ను అడిడాస్ ఆవిష్కరించనుంది.


More Telugu News