రుతురాజ్ కు మంచి భవిష్యత్తు ఉందని పాక్ మాజీ దిగ్గజం కితాబు
- తీవ్రమైన ఒత్తిడిలోను రుతురాజ్ అద్భుతంగా రాణించాడని అక్రమ్ కితాబు
- ఐపీఎల్ లో అద్భుతమైన క్యాచ్ లు, ఫీల్డింగ్ చూశామని వ్యాఖ్య
- రుతురాజ్ కు మంచి భవిష్యత్తు ఉందన్న పాక్ మాజీ దిగ్గజం
ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఐదోసారి ఛాంపియన్ గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రుతురాజ్‌ను పాక్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ ప్రశంసించాడు. తీవ్రమైన ఒత్తిడిలోను రుతురాజ్ అద్భుతంగా ఆడాడని, ఫిజికల్ గా కూడా ఫిట్ గా వున్నాడని చెప్పాడు. ఈసారి ఐపీఎల్ లో అద్భుతమైన క్యాచ్ లు, ఫీల్డింగ్ ను చూశామన్నాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పాడు. ఐపీఎల్ లోను, భారత జట్టులోను కీలక ప్లేయర్ గా మారుతాడని అంచనా వేశాడు.
కాగా, ఐపీఎల్ లో ఈ సీజన్ లో రుతురాజ్ 16 మ్యాచ్ లు ఆడి 590 పరుగులు చేశాడు. 2021 సీజన్ లో 635 పరుగులు చేశాడు. అప్పుడు కూడా చెన్నై ఛాంపియన్ గా నిలిచింది. రుతురాజ్ 2023 ఐపీఎల్ లో అద్భుతంగా రాణించాడు.
కాగా, ఐపీఎల్ లో ఈ సీజన్ లో రుతురాజ్ 16 మ్యాచ్ లు ఆడి 590 పరుగులు చేశాడు. 2021 సీజన్ లో 635 పరుగులు చేశాడు. అప్పుడు కూడా చెన్నై ఛాంపియన్ గా నిలిచింది. రుతురాజ్ 2023 ఐపీఎల్ లో అద్భుతంగా రాణించాడు.