తిరుపతిలో ఈదురుగాలులు... గోవిందరాజస్వామి ఆలయంలో చెట్టు కూలి కడప జిల్లా డాక్టర్ మృతి
- గోవిందరాజస్వామి ఆలయంలో ప్రమాదం
- భారీ గాలివాన ఓ డాక్టర్ ప్రాణాలను హరించిన వైనం
- గాయపడిన ముగ్గురికి రుయా ఆసుపత్రిలో చికిత్స
- మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నట్టు వైవీ సుబ్బారెడ్డి వెల్లడి
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఈదురుగాలు, వర్షంతో ఆలయ ఆవరణలోని రావిచెట్టు కూలిపోయింది. ఈ ఘటనలో ఓ డాక్టర్ మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. మరణించిన వైద్యుడ్ని కడప జిల్లాకు చెందిన డాక్టర్ గుర్రప్పగా గుర్తించారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆలయంలో ప్రమాదం జరగడం బాధాకరమైన ఘటన అని పేర్కొన్నారు. భారీ గాలివానకు రావిచెట్టు కూలిపోయిందని వెల్లడించారు. మృతుడు డాక్టర్ గుర్రప్ప కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించనున్నట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్టు వివరించారు.