జగన్... ఈ లిస్టులో ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది?: చంద్రబాబు

  • అత్యధిక ఎఫ్ డీఐలు రాబట్టిన రాష్ట్రాలతో ఇండియన్ టెక్ అండ్ ఇన్ ఫ్రా ట్వీట్
  • ఏపీకి 13వ స్థానం
  • నీ వైఫల్యం వల్లే ఏపీ దిగజారిందంటూ జగన్ పై చంద్రబాబు విమర్శలు 
ఇండియన్ టెక్ అండ్ ఇన్ ఫ్రా సంస్థ చేసిన ఓ ట్వీట్ ఆధారంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. 2023 ఆర్థిక సంవత్సరంలో భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రాల జాబితాను ఇండియన్ టెక్ అండ్ ఇన్ ఫ్రా ట్వీట్ చేసింది. 

దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, ఈ జాబితాలో ఆంధప్రదేశ్ ఎక్కడుంది జగన్? అని ప్రశ్నించారు. రాష్ట్ర పాలనలో నీ వైఫల్యం ఏపీని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జాబితాలో 13వ ర్యాంకుకు దిగజార్చింది అని విమర్శించారు. 

"దోచుకో, పంచుకో, తినుకో విధానంతో నువ్వు దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రివి అయ్యావు. కానీ ప్రజలు మాత్రం కనీస అవసరాలకు కూడా నోచుకోవడంలేదు. నీ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారు. ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు" అని చంద్రబాబు పేర్కొన్నారు.


More Telugu News