మే నెలలో 12 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు

  • ఈ ఏడాది మే నెలలో రూ.1.57 లక్షల కోట్ల జీఎస్టీ
  • 2022 మే నెలలో రూ.1.41 లక్షల కోట్ల జీఎస్టీ
  • తాజా జీఎస్టీ వివరాలు వెల్లడించిన కేంద్రం 
మే నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్రం విడుదల చేసింది. కిందటి ఏడాది మే నెల వసూళ్లతో పోల్చితే ఈ ఏడాది మే నెలలో 12 శాతం మేర జీఎస్టీ వసూళ్లలో పెరుగుదల నమోదైనట్టు తెలిపింది. 2022 మే నెలలో రూ.1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కాగా... 2023 మే నెలలో రూ.1,57,090 కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

ఇందులో కేంద్ర జీఎస్టీ వాటా రూ.28,411 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ.35,828 కోట్లు అని వివరించింది. సమీకృత జీఎస్టీ వసూళ్ల విలువ రూ.81,363 కోట్లు (దిగుమతి సుంకం రూ.41,772 కోట్లతో కలిపి) అని, సెస్ రూ.11,489 కోట్లు (దిగుమి సుంకం రూ.1,057 కోట్లతో కలిపి) అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 

కాగా, ఈ ఏడాది ఏప్రిల్ లో వసూలైన రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ ఇప్పటివరకు అత్యధికంగా నిలిచింది.


More Telugu News