తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
- ఉద్యోగులకు 4.9 శాతం డీఏ మంజూరు చేసినట్లు వెల్లడి
- జూన్ నెల వేతనంతో కలిపి ఉద్యోగులకు డీఏ చెల్లించనున్నట్లు వెల్లడి
- తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల కీలకపాత్ర
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 4.9 శాతం డీఏ మంజూరు చేసినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి ఉద్యోగులకు డీఏ చెల్లించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారు. 2011లో 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది. మిగిలిన ఒక్క డీఏను త్వరలో ఉద్యోగులకు ప్రకటించనున్నట్లు తెలిపారు.