మీ కోసం కష్టపడతాను.. మరింత సేవ చేస్తాను: హరీశ్ రావు
- సిద్దిపేటవాసులతో 'మీరే నా బలం.. మీరే నా బలగం' అన్న మంత్రి
- ఇక్కడి ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉన్నంత కాలం సేవ చేస్తానని వ్యాఖ్య
- కేసీఆర్ వచ్చాక గ్రామాల్లో రూపురేఖలు మారిపోయాయన్న హరీశ్
మీరే నా బలం.. నా బలగం.. మీ కోసం ఇంకా కష్టపడుతాను.. మరింత సేవ చేస్తాను అన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు. గురువారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సిద్దిపేట ప్రజల ఆశీస్సులు, దీవెనలు, బలం ఉన్నంత కాలం సేవ చేస్తూనే ఉంటానన్నారు.
కేసీఆర్ పాలనలో గ్రామాల్లో రూపురేఖలు మారిపోయాయని, గల్లీ గల్లీలో సీసీ రోడ్లు వచ్చాయన్నారు. తెలంగాణ సిద్ధించాక కేసీఆర్ సీఎం కావడంతో అవ్వాతాతలకు గౌరవం పెరిగిందన్నారు. తెలంగాణ రాకపోతే ఇంతటి అభివృద్ధి జరిగేదా? అని ప్రశ్నించారు. పెన్షన్ గతంలో రూ.200 ఉండేదని, ఇప్పుడు 2000కు పెరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల కొరత ఉండేదని, ఇప్పుడు తెలంగాణ వచ్చాక రైతుల కోసం 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు.