హ్యాపీ లైఫ్ కోసం పంచ సూత్రాలు చెప్పిన ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా

  • ఇతరులు కోరుకుంటున్న దానికంటే ఎక్కువ ఇవ్వాలన్నా గోయంకా 
  • ఓటమి నుంచి పాఠం నేర్వడం మర్చిపోవద్దని సూచన 
  • ఇంట్లో ప్రేమ పూర్వకంగా మెలగాలంటూ సలహా 
జీవితంలో ఎంత సాధించామన్నది కాదు, ఎంత సంతోషంగా ఉన్నామనేది ముఖ్యం. విజయం అయినా ఓటమి అయినా.. సానుకూల దృక్పథంతో సాగిపోవడం ముఖ్యం. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా సంతోషకర జీవితం కోసం ఆచరించతగ్గ ఐదు ముఖ్యమైన సూత్రాలను సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు.

  • తోటి వారు కోరుకుంటున్న దాని కంటే ఎక్కువ ఇవ్వండి. దాన్ని ఎంతో ఉత్సాహంగా చేయండి.
  • ఓటమి పాలైనప్పుడు, అందులోని పాఠాన్ని మాత్రం నష్టపోవద్దు.
  • ఒంటరిగా మీ కంటూ కొంత సమయం పాటు వెచ్చించండి.
  • మూడు ఆర్ లు గుర్తు పెట్టుకోవాలి. మీకు మీరు గౌరవం (సెల్ఫ్ రెస్పెక్ట్) ఇచ్చుకోవాలి. ఇతరులను గౌరవించాలి. మీ చర్యలకు మీరు బాధ్యత వహించాలి.
  • ఇంట్లో ప్రేమపూర్వక వాతావరణం ఎంతో ముఖ్యం.

హర్ష గోయంకా చెప్పిన ఈ సూత్రాల పట్ల నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ సూత్రాలను పాటించడం ద్వారా అర్థవంతమైన, పరిపూర్ణమైన జీవితాన్ని కొనసాగించొచ్చని ఒకరు కామెంట్ చేశారు. సంతోషకరమైన జీవితానికి అంతిమ మార్గమని మరొకరు పేర్కొన్నారు.


More Telugu News