విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన 300 మంది యాత్రికులు

  • పితోర్‌గఢ్ జిల్లాలో విరిగిపడిన కొండచరియలు
  • లఖన్‌పూర్ సమీపంలో 100 మీటర్ల మేర కొట్టుకుపోయిన లిపులేక్-తవాఘాట్ రోడ్డు
  • వాతావరణశాఖ సూచనలకు అనుగుణంగా యాత్రికులు ప్లాన్ చేసుకోవాలన్న అధికారులు
ఉత్తరాఖండ్‌లోని పితోరగఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడడంతో 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. కొండచరియలు విరిగిపడి రోడ్డు కొట్టుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. లిపులేఖ్-తవాఘాట్ రోడ్డు లఖన్‌పూర్ సమీపంలో 100 మీటర్ల మేర కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణికులు ధర్చుల, గుంజిలలో చిక్కుకుపోయారు. ఈ రోడ్డును రెండు రోజల తర్వాత తిరిగి తెరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరోవైపు, అల్మోరా, బాగేశ్వర్, చమోలి, చంపావత్, డెహ్రాడూన్, గర్వాల్, హర్‌ద్వార్, నైనిటాల్, పితోర్‌గఢ్, రుద్రప్రయాగ్, తెహ్రీ గర్వాల్, ఉదమ్‌సింగ్ నగర్, ఉత్తరకాశీ జిల్లాల్లో దుమ్ము తుపాను, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

యాత్రికులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అనవసరంగా ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచించారు. యమునోత్రి, గంగోత్రి ధామ్ యాత్రకు వస్తున్న యాత్రికులు వాతావరణశాఖ సూచనలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని, రెయిన్ కవర్, గొడువు, ఊలు దుస్తులను తెచ్చుకోవాలని సూచించారు.


More Telugu News