ఖైరతాబాద్ గణపతి ఎత్తు ఈసారి 61 అడుగులు

  • నిర్జల్ ఏకాదశిని పురస్కరించుకుని కర్ర పూజ నిర్వహించిన ఎమ్మెల్యే దానం నాగేందర్, పి.విజయారెడ్డి
  • గణేశ్ చవితికి మూడు రోజుల ముందుగానే విగ్రహ నిర్మాణం పూర్తి
  • మరో వారం పది రోజుల్లో విగ్రహ నిర్మాణ పనులు
  • ఆ తర్వాత నమూనా ప్రకటన
ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి 61 అడుగుల ఎత్తైన విగ్రహం రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. నిర్జల్ ఏకాదశిని పురస్కరించుకుని నిన్న సాయంత్రం విగ్రహ ఏర్పాటు మండపం వద్ద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ పి.విజయారెడ్డితో కలిసి వేదమంత్రాల నడుమ తొలిపూజ (కర్రపూజ) నిర్వహించారు. 

అనంతరం ఉత్సవ నిర్వాహకులు రాజ్‌కుమార్, సందీప్ తదితరులు మాట్లాడుతూ.. గతేడాదిలానే ఈసారి కూడా మట్టి విగ్రహాన్నే ప్రతిష్ఠించనున్నట్టు తెలిపారు. గణేశ్ చవితికి మూడు రోజుల ముందుగానే విగ్రహ నిర్మాణం పూర్తవుతుందన్నారు. వారం పది రోజుల్లో పనులు ప్రారంభిస్తామని, ఆ తర్వాత విగ్రహ నమూనాను ప్రకటిస్తామని తెలిపారు. 



More Telugu News