సముద్రంలో మునిగిపోతున్న యువకులను కాపాడిన ఎమ్మెల్యే
- గుజరాత్‌లో బుధవారం వెలుగు చూసిన ఘటన
- పట్వా గ్రామ సమీపంలో నలుగురు యువకుల సముద్ర స్నానం
- అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో ప్రమాదంలో పడ్డ యువకులు, సాయం కోసం ఆర్తనాదాలు
- వెంటనే నీళ్లలోకి దూకి ముగ్గురిని కాపాడిన బీజేపీ ఎమ్మెల్యే హీరా సోలంకీ
- నాలుగో యువకుడి మృతి, సాయంకాలం మృతదేహం లభ్యం
సముద్రస్నానానికి వెళ్లి ప్రమాదంలో పడ్డ ముగ్గురు యువకులను ఓ బీజేపీ ఎమ్మెల్యే కాపాడారు. అయితే, దురదృష్టవశాత్తూ నాలుగో యువకుడు మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. కాల్పేశ్ షియాల్, విజయ్ గుజారియా, నికుల్ గుజారియా, జీవన్ గుజారియా అనే యువకులు బుధవారం మధ్యాహ్నం రాజూలా నియోజకవర్గంలోని పట్వా గ్రామానికి సమీపంలో సముద్రస్నానానికి వెళ్లారు.
అయితే, అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారు నీళ్లల్లో మునిగిపోవడం మొదలైంది. భయపడిపోయిన యువకులు పెద్ద పెట్టున ఆర్తనాదాలు చేస్తూ సాయం కోసం వేడుకున్నారు. అదే సమయంలో బీచ్‌లో ఉన్న ఎమ్మెల్యే సోలంకీ వారిని గమనించి రంగంలోకి దిగారు. మరో ఆలోచన లేకుండా ఆయన తక్షణం సముద్రంలోకి దిగి ముగ్గురు యువకులను కాపాడారు. అయితే, జీవన్ గుజారీ మాత్రం నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం సాయంత్రం అతడి మృతదేహం లభించింది.