ఉద్యోగులకు టీసీఎస్ వార్నింగ్!
- ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్‌లో ‘వర్క్ ఫ్రం ఆఫీస్’ పాలసీ
- ఉద్యోగులు వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశం
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఉద్యోగులకు హెచ్చరిక
‘వర్క్ ఫ్రం ఆఫీస్’ విధానానికి కట్టుబడి ఉండాలంటూ ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ తన ఉద్యోగులకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘వర్క్ ఫ్రం ఆఫీస్’ విధానం ప్రకారం టీసీఎస్ ఉద్యోగులు వారంలో మూడు రోజులు కచ్చితంగా ఆఫీసుకు రావాల్సి ఉంటుంది.
కార్యాలయంపై అవగాహన పెంచుకున్న ఉద్యోగులు తమ లక్ష్యాలను మరింత సమర్థవంతంగా నెరవేరుస్తారని కంపెనీ ఈ సందర్భంగా పేర్కొంది. గత రెండేళ్లల్లో అనేక మంది కొత్తగా టీసీఎస్‌లో చేరారని, వారందరికీ సంస్థ ఆఫీసులపై అవగాహన ఉండాలని అభిప్రాయపడింది.