జగన్ ముందస్తుకు వెళితే... : సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
- జగన్ ముందస్తుకు వెళితే స్వాగతిస్తామని వ్యాఖ్య
- ఐటీ రంగంలో తెలంగాణ కంటే ఏపీ వెనుకబడిందని విమర్శ
- నాలుగేళ్లలో ఏపీని అప్పుల పాలు చేశారని వ్యాఖ్య
ముఖ్యమంత్రి జగన్ ముందస్తు ఎన్నికలకు వెళితే తాము స్వాగతిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళితే జగన్ ముందే అధికారం కోల్పోయి ఇంటికి వెళతాడన్నారు. జూన్ 7న జగన్ అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ అని చెబుతున్నారని, ఆ సమయంలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంటే స్వాగతిస్తామన్నారు.
ఐటీ రంగం కోసం మాట్లాడితే జగన్ ప్రభుత్వం ఉరేసుకోవాలని, ఎందుకంటే ఐటీ ఎగుమతులు ఏపీ నుండి కేవలం 0.14 శాతమే అన్నారు. తెలంగాణ కంటే ఏపీ నుండి ఎగుమతులు చాలా తక్కువ అన్నారు. దీనికి జగన్ తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు.
నాలుగేళ్లలో ఏపీని అప్పుల పాలు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధి అంతా బూటకమని, జగన్ మాటలు అన్నీ అవాస్తవాలే అన్నారు. ఏ ఒక్క రంగంలోను అభివృద్ధి లేదన్నారు. కానీ సొంత మీడియాలో మాత్రం అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు.
కేసుల కోసమే జగన్ ఢిల్లీకి వెళుతున్నారని, రాజధాని అమరావతిని చంపేశారన్నారు. అమరరాజా కంపెనీని వేధించి రాష్ట్రం నుండి పంపించారని ఆరోపించారు. కియా, జాకీ పరిశ్రమలదీ అదే పరిస్థితి అన్నారు.