నాడు జగన్ రాజకీయ లబ్ది పొందలేదా... సజ్జల వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్
- వివేకా హత్య కేసులో రాజకీయ కోణం లేదన్న సజ్జల
- ఇందులో రాజకీయం లేదని సజ్జల అనడం హాస్యాస్పదమన్న పిల్లి మాణిక్యరావు
- సజ్జల మాటలు పక్కదారి పట్టించేలా ఉన్నాయని విమర్శలు
వివేకా హత్య కేసులో రాజకీయ కారణాలే లేవని, ఈ కోణంలో సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడంలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే.
వివేకా హత్యకు అసలైన కారణం ఆయన రాసిన లేఖలోనే ఉందని, ఆ లేఖపై సీబీఐ ఎందుకు దృష్టి పెట్టడంలేదని అన్నారు. చంద్రబాబు అనుకూల మీడియా వివేకా హత్యకేసును పక్కదారి పట్టించేలా చర్చలు నిర్వహిస్తోందని విమర్శించారు. ఆఖరికి తెలంగాణ హైకోర్టు జడ్జికి కూడా దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని అన్నారు. సీఎం జగన్ ను ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
దీనిపై టీడీపీ కౌంటర్ ఇచ్చింది. సజ్జల వ్యాఖ్యలను ఖండించింది. టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు స్పందిస్తూ, వివేకా హత్య కేసులో రాజకీయం లేదని సజ్జల అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. సజ్జల మాటలు కోర్టులను, దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించే విధంగా ఉన్నాయని అన్నారు. నాడు నారాసుర రక్తచరిత్ర అని సాక్షిలో చంద్రబాబుపై విషప్రచారం చేసి రాజకీయంగా జగన్ లబ్ది పొందలేదా? అని పిల్లి మాణిక్యరావు ప్రశ్నించారు.