ప్రపంచమంతా చూస్తోంది.. కేంద్రం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి: కవిత
- మహిళా రెజ్లర్లను వేధించిన బ్రిజ్ భూషణ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదన్న కవిత
- నిందితుడు బయటే తిరుగుతున్నాడని విమర్శ
- ప్రస్తుత పరిణామాలను ప్రపంచమంతా చూస్తోందని వ్యాఖ్య
రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఎంతో కష్టపడి, అంకితభావంతో, దేశంపై ప్రేమతో మహిళా రెజ్లర్లు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటారని అన్నారు. దేశ ప్రయోజనాల కోసమైనా కేంద్ర ప్రభుత్వం రెజ్లర్ల సమస్యల గురించి ఆలోచించాలని చెప్పారు. పోక్సో వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పటికీ నిందితుడు బయట తిరుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితులకు న్యాయాన్ని తిరస్కరించరాదని చెప్పారు. దేశానికి బంగారు పతకాలను సాధించిన మహిళా క్రీడాకారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం తగదని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రపంచమంతా చూస్తోందని... కేంద్ర ప్రభుత్వం నుంచి దేశ ప్రజలు సమాధానాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించాలని కోరారు.