చెన్నై గెలుపును తక్కువ చేసిన ఇర్ఫాన్ పఠాన్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
- గుజరాత్ బౌలర్లకు పూర్తి కోటా రాలేదన్న ఇర్ఫాన్
- ఇది సీఎస్కేకి అనుకూలించిందంటూ ట్వీట్
- 15 ఓవర్లకు అంత పెద్ద లక్ష్యం సులభమా? అంటూ పఠాన్ ను నిలదీస్తున్న నెటిజన్లు
చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ లో గొప్పగా ఆడి విజయం సాధించగా.. వర్షం రావడం చెన్నై జట్టుకు అనుకూలించినట్టు కొందరు విశ్లేషిస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 214 పరుగుల స్కోరు నమోదు చేసింది. తర్వాత చెన్నై బ్యాటింగ్ కు దిగిన వెంటనే చూసేందుకు వరుణుడు కూడా తొందరపడ్డాడు. దీంతో వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ విధానంలో చెన్నై జట్టు ముందు 15 ఓవర్లకు 171 పరుగుల లక్ష్యాన్ని పెట్టారు. దీంతో చెన్నై బ్యాటర్లు దూకుడుగా ఆడి చివరి బంతికి విజయం ఖరారు చేశారు.
దీనిపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘‘వర్షం కారణంగా కుదించిన ఫైనల్ మ్యాచులో సీఎస్కే బ్యాటింగ్ ను ఆరంభించింది. రెగ్యులర్ కోటా 4 ఓవర్లతో పోలిస్తే షమీ, రషీద్, మోహిత్ ఒక్కో ఓవర్ కోల్పోయారు. దీంతో లీగ్ లో టాప్ 3 వికెట్ లు తీసే బౌలర్లు తమ వంతుగా 18 బంతులను వేయలేని, వికెట్లు తీయలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. అది కచ్చితంగా సీఎస్కేకి కలిసొచ్చింది’’ అని ఇర్ఫాన్ తన ట్వీట్ లో అభిప్రాయపడ్డాడు. ఈ విశ్లేషణ చెన్నై అభిమానులు, ధోనీ అభిమానుల్లో ఆగ్రహానికి కారణమైంది.
‘‘15 ఓవర్లకే 171 పరుగుల లక్ష్యం,. అది కూడా ఫైనల్ మ్యాచులో. అత్యుత్తమ బౌలింగ్ దాడిని ఎదుర్కొని దీన్ని సాధించడం అన్నది చాలా సులభమని ఇర్ఫాన్ పఠాన్ లాజిక్కా?" అంటూ యాదవ్ అనే యూజర్ ప్రశ్నించాడు. ‘‘ఐదు ఓవర్లకు గాను కేవలం 43 పరుగులే తగ్గించారు. జీటీ 10 ప్లస్ రన్ రేటుతో స్కోరు చేసింది. కానీ, సీఎస్కేని 11.5 ప్లస్ రన్ రేటుతో లక్ష్యం చేరుకోవాలని ఆదేశించారు. ఇది జీటీకి అన్యాయం ఎలా అవుతుంది? అని ఎంఎస్డీ స్టాన్ అనే యూజర్ ప్రశ్నించాడు. పూర్తి గేమ్ జరిగి ఉంటే 19 ఓవర్లకు ఆట ముగిసి ఉండేదని ప్రభు అనే యూజర్ పేర్కొన్నాడు.