ఏపీలో కొత్త సినిమాలను విడుదల రోజే మీ ఇంట్లోనే చూడొచ్చు... ఎలాగంటే...!

  • ఫస్ట్ డే ఫస్ట్ షో.. ఏపీ ఫైబర్ నెట్ వినూత్న కార్యక్రమం
  • జూన్ 2న ప్రారంభించనున్న ఏపీ మంత్రి అమర్నాథ్
  • రూ.99లతో సబ్ స్క్రైబ్ చేసుకుంటే కొత్త సినిమా చూసే అవకాశం 
ఏపీలో ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ ఏపీ ఫైబర్ నెట్ వినియోగదారులకు వినూత్న అవకాశం కల్పిస్తోంది. కొత్త సినిమాలను విడుదల రోజు ఇంటి వద్దనే వీక్షించేందుకు ఓ కొత్త పథకం తీసుకువస్తోంది. దీని పేరు ఫస్ట్ డే ఫస్ట్ షో. 

రూ.99లతో సబ్ స్క్రైబ్ చేసుకుంటే ఎంచక్కా కొత్త సినిమా చూసేయొచ్చు. ఈ కార్యక్రమాన్ని జూన్ 2న ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించనున్నారు. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పి.గౌతమ్ రెడ్డి దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు. 

ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమంలో తొలుత నిరీక్షణ సినిమాను ప్రదర్శిస్తామని వెల్లడించారు. ఒకసారి సబ్ స్క్రైబ్ చేసుకుంటే 24 గంటల వరకు కొత్త సినిమాను చూసే వీలుంటుందని తెలిపారు. సినిమా నిర్మాతలకు, ప్రేక్షకులకు లాభదాయకంగా ఉండేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామని వివరించారు. ఓటీటీ విధానం లాగా కాకుండా, కొత్త సినిమాను నేరుగా లైవ్ లో ప్రసారం చేయనున్నట్టు వెల్లడించారు.


More Telugu News