అందాల పోటీల్లో భార్యకు అన్యాయం జరిగిందని ఏం చేశాడంటే...?
- బ్రెజిల్ లో 'మిస్ గే మాటో గ్రాసో 2023' అందాల పోటీలు
- భార్యకు మొదటి స్థానం దక్కలేదని కిరీటాన్ని ముక్కలు చేసిన రన్నరప్ భర్త
- కిరీటాన్ని రెండుసార్లు నేలకేసి కొట్టి, ధ్వంసం
- సెక్యూరిటీ జోక్యంతో సద్దుమణిగిన పరిస్థితి
అందాల పోటీల్లో తన భార్యకు అన్యాయం జరిగిందంటూ ఓ వ్యక్తి కిరీటాన్ని ముక్కలు చేసిన సంఘటన బ్రెజిల్ లో చోటు చేసుకుంది. బ్రెజిల్ లో ఇటీవల నిర్వహించిన మిస్ గే మాటో గ్రాసో 2023 అందాల పోటీల సందర్భంగా ఇది జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ పోటీల్లో నథాలీ బెకర్, ఇమ్మాన్యుయెల్ బెలీని... వీరిద్దరు ఫైనల్ కు చేరుకున్నారు. ఆ తర్వాత బెలీని అందాల పోటీల్లో విజేతగా ప్రకటించారు. ఆమె కిరీటాన్ని అందుకునే లోపే నథాలీ బెకర్ భర్త స్టేజ్ పైకి దూసుకు వచ్చాడు. ఆగ్రహంతో కిరీటాన్ని లాక్కొని, రెండుసార్లు దానిని నేలకేసి కొట్టాడు. అది ధ్వంసమయ్యాక అక్కడే ఉన్న వారిపై అరుస్తూ తన భార్యను పక్కకు తీసుకెళ్లాడు. అతని చర్యకు అందరూ ఆశ్చర్యపోయారు. సెక్యూరిటీ జోక్యం చేసుకొని, అతనిని పక్కకు తీసుకెళ్లింది. భార్యకు అన్యాయం జరిగిందని భావించి అతను అలా ప్రవర్తించాడని, అయితే న్యాయ నిర్ణేతలు సరైన నిర్ణయమే తీసుకున్నారని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.